Thursday, November 29, 2018

ఒక సంధ్యా సమయం!!!

ఆహా!  ఏమి ఈ సంధ్యా  సమయం...
ఆకాశమంతా నీలి  బూడిదరంగులో...
దివి నించి నా పైన పూలరెక్కల్లాంటి స్వాతి  చినుకులు...
మృదువైన వేణువు నించి వెలువడే సంగీతంలాంటి సన్నని గాలి...
మత్తెక్కించే మల్లెపువ్వు సువాసనలాంటి మట్టి వాసన...
ఒక చేతిలో మిరపకాయ బజ్జి, మరోచేతిలో వేడి వేడి  కాఫీ...
ఈ సమయంలో తను పక్కనుంటే.... ఆ అనుభూతే వేరు...!

Tuesday, October 17, 2017

Stop Violence Against Women

నీడనిచ్చే చెట్లనే నరుకుతున్నావు!
మధువునిచ్చే పూలనే నలిపేస్తున్నావు!
ఆఖరుకి ఆనందాన్నిచ్చే మొగ్గలనే చిదిమి తుంచేస్తున్నావు!
వీళ్ళు జన్మించడమే తప్పా లేక వీళ్ళు నీకు జన్మనివ్వడమే పాపమా?

(Eng version)
You beast, cutting the trees which provides you shade!
And also crushing the flowers which gives you honey!
At least not leaving the beautiful buds which makes us always happy!
Is it mistake of their birth or is it sin giving you birth? 

Monday, August 20, 2012

Don't Leave me!

ప్రతి దినం నీతోనే ఉదయించాలి...
అనునిత్యం నీడలా నా తోడువై ఉండాలి...
కల కాకూడదు నీ పరిచయం...
కల్ల కాకూడదు మన పయనం...

నీ దరహాసం చూసి, తారలన్ని కూడా ఈర్ష్య పడుతున్నాయి, చంద్రుడు కూడా. ఇంత ప్రకాశవంతమైన నీ లాంటి తేజస్సు వాళ్ళలో లేదని.
నీ మనసు మధురామృతం. నిన్ను చూసి, ఈ పూలన్నీ కూడా సహించ లేకపోతున్నాయి. నీ మనసు లోని మకరందం తమ లో లేదని.
నిన్ను చూసి, సముద్రుడు కుల్లుకుంటున్నాడు. నీ లాంటి విశాలమైన హృదయం తనకు లేదని.
నిన్ను చూసి కోయల పాడటం మానుకుంది, శ్రావ్యమైన సంగీతం లాంటి నీ గాత్రం తనకు లేదని.
నిన్ను చూసి భూ మాత ముఖం చాటేసింది, నీ లా భరించే ఓపిక తనకి లేదు అని.

చంద్రునికి మచ్చే అందం. గులాబికి ముల్లె ఆయుధం. సముద్రానికి ఆటు, పోటులే ఆనందం. ఇవన్ని కూడా సహజం. విధి రాత. అలానే నేను కూడా నీకు!!!

Saturday, February 18, 2012

నిరీక్షణ





క్షణ క్షణం అనుక్షణం నీకై నిరీక్షణం..
గాయం భయం నీకై మాయం!!!

నీకై వేచి చూస్తుంది నా మనస్సు...అదిగో అక్కడ ఎడారిలో (ఎండమావి) అంటుంది నీ మనస్సు.
నీకై వెతుకుంది నా కనులు... అదిగో చీకటిలో నీ నీడనై ఉన్నా అంటుంది నీ కనులు.
నీకై పయనం అవుతుంది నా పాదం...అదిగో నింగి, నేల కలిసే చోట వైపు నడిపిస్తుంది నీ మార్గం.
నీకై చాచుతున్నాయి నా చేతులు...అదిగో నీటిలో ఉన్న నీ ప్రతిమను చూపిస్తున్నాయి నీ చేతులు.
నీ పిలుపుకై వేచి చూస్తుంది నా చెవులు...పిలుస్తున్నా అంటుంది నీ మౌనం.
నీకై, వేచి వేచి...అలసి...సొలసి...ఇక ఆగుతా అంటుంది నా హృదయం!!!

Monday, December 5, 2011

Am I castaway?




I am travelling alone in the dark
Looking for a lamp to show me the way
On the way, found the brighter one, thought it was for me and mine
Very clearly, illuminated the path for a while
Easily Focus was Changed as time passes, became more Dim and finally Disappeared
Driven through the wrong path, reached the cost
Eventually got a boat with No Oars, restarted my Journey
Exactly Don't know when it will Sink and when the waves Hit it
Perfectly planned by Universe? But this penalty for what?
Tired, Staring at the universe, Waiting for the Final ****
Is my fate despised me? Am I castaway?